కర్ణాటకలో కోటి మంది మహిళల సాధికారత లక్ష్యంగా బజ్ విమెన్ వాహన సేవలు ప్రారంభించారు ఉత్తరా నారాయణన్.ఈ వాహనం ద్వారా కర్ణాటకలోని 200 గ్రామాల్లోని మహిళా జీవితాల్లో వెలుగులు నింపారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఉత్తరా. గ్రామాల్లో స్త్రీలకు నైపుణ్యాల శిక్షణ, ఆర్ధిక విషయాలపై అవగాహన అవకాశాల కల్పన ద్వారా చేయూత నిచ్చేందుకు 2012 లో క్లాసెస్ ఆన్ వీల్స్ ప్రాజెక్ట్ ప్రారంభించి పల్లె పల్లెకు వాహనాన్ని నడిపారు.తర్వాత బజ్ విమెన్ వాహన సంస్థ గా మారింది.ఈ ‘బజ్ విమెన్ వాహన’ సంస్థ సేవల ద్వారా గ్రామీణ మహిళల కుట్టుపని,హస్తకళలు,కప్పుల తయారీ వంటి వాటిలో శిక్షణ పొంది చిన్నచిన్న ఉపాధి మార్గాలు ఎంచుకున్నారు.

Leave a comment