చర్మం పైన శ్రద్ధ తగ్గితే వార్ధాక్య లక్షణాలు వస్తాయి. కళ తగ్గి చర్మమ వయస్సుని పెంచేస్తుంది. అందుచేత చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం వేసుకున్న పౌడర్, క్రీమ్, లేదా మేకప్ తప్పని సరిగా సాయంత్రం పూర్తిగా తొలగించాలి. మొహం పైన చర్మ రంద్రాలు క్రీమ్ అందుబాటులో వుంటే దాన్ని ఉపయోగించాలి. మేకప్ రసాయినాలు ముఖ గ్రంధులను ముసేస్తాయి కనుక ఎప్పటికప్పుడు దాన్ని తొలగించకపొతే మరమ్మత్తులకు అవకాశం లేక చర్మం కళ పోగొట్టుకుంటుంది. నూనె అధికంగా వుండే ఆహార పదార్ధాలు వేపుళ్ళతో చర్మం పోదవ్వుటుంది. యాంటీ ఆక్సిడెంట్ కలిగిన కూరగాయలు ముదురు రంగు కలిగిన పండ్లు తినాలి. ఇవి తగినంత మేరకు అందక పొతే చర్మం కణాలు దెబ్బతిని పోతాయి. మానసిక వత్తిడి ప్రభావం కుడా చర్మం పైన కనబడుతుంది కనుక తగినంత ఆహారం, సరైన నిద్ర చాలా అవసరం.
Categories