నటులకు మంచి పాత్ర దొరికితే ఎంత అదృష్టం. మొదట్లో పాత్రల గురించి ఎంత ఆలోచించే దాన్నో బాక్సాఫిస్ ఫలితాల గురించి అంతగానే దిగులుపడేదాన్ని. ఇప్పుడు ఆ తీరు మార్చుకున్నాను. కాస్త మంచి పాత్ర వస్తే ఎన్ని సవాళ్ళకైన సిద్దం కావాలనుకున్నాను. ఫలితాల గురించి ఎదురయ్యే సవాళ్ళ గురించి మనసులో ప్రశ్నలు తీసేశాను అంటుంది కాజల్. నా మనసు సహాసాన్ని కోరుకుంటుంది. దర్శకులు నా కోసం పాత్రలు ఉన్నాయని చెపుతూ ఉన్నంత కాలం నా ప్రయాణం కొనసాగుతుంది. పాత్రల గురించి మంచిగా ఉంటే బావుండని ఆలోచించటం కాదు, నాకు సవాల్ గా నిలబడే పాత్రని రెండు చేతులతో ఆహ్వానించాలని ఉంది.ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే పాత్రల గురించి నా దృష్టంతా ఉంది అంటుంది కాజల్. నటనలో పరిణితి సాధించాక మది ఇంతే కదా కోరుకోవల్సింది.

Leave a comment