పోషకాహర లోపంతో రక్త హినత ఏర్పడుతుంది. మన దేశంలో ఈ రక్త హీనత తో బాధపడేవాళ్ల సంఖ్య 70 శాతం కన్నా ఎక్కువ వుంటుంది. ఇందులోంచి బయటపడటం సులభమే. డాక్టర్లు కొన్ని రకాల పండ్లు, ఆకుకురలు సమస్య తీరుస్త్తాయి అంటున్నారు. బీట్ రూట్ రసంలో శరీరానికి ఐరన్ దొరుకుతుంది, అలగే అరటి పండులో పోషకాలు ఎక్కువే. తేనెలో కలిపి తీసుకుంటే ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఖర్జురాల్లో విటమిన్ సీ ఎక్కువగా వుంటుంది. గ్లాసుడు పాలలో రెండు మూడు ఖర్జురాలు నానబెట్టి ఉదయన్నే తాగితే ఫలితం ఉంటుంది. అలగే దానిమ్మ రసంలో దాల్చిన చెక్క పొడి ,తేనె కలిపి తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. అలగే పాలకూర,మెంతి, తోటకూర మొదలైన ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవన్ని భోజనంలో భాగంగా తీసుకుంటే రక్తహినతను పోగొడతాయి.
Categories