Categories
మాంసాహారం లోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయనుకొంటారు. కానీ శాఖహారంలోనూ ,మాంసంతో సమానంగా ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఏ శాఖహారంలో ఏ ఏ ప్రోటీన్లు ఎంత నిష్పత్తిలో ఉంటాయో చార్టు వేసుకుంటే ప్రతి రోజు ప్రోటీన్ల కొరత రాకుండా ఏం తినాలో తెలుస్తుంది. న్యూ ట్రీషనిస్టుల కొలతల ప్రకారం నట్, బటర్స్ లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఓట్ మీల్ ఒక కప్పులో ఆరు గ్రాములు, బ్రోకాలీ ఒక సర్పింగ్ లో ఐదు గ్రాములు, కాలీఫ్లవర్ ఒక సర్పింగ్ లో ఐదుగ్రాములు, గుప్పెడు నట్స్ లో ఆరు గ్రాములు, బచ్చల కూర ఒక సర్పింగ్ లో ఐదు గ్రాములు, పెరుగు వంద గ్రాములు 10గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. శాకహారం కూడా నిస్సందేహాంగా బలమైనదే.