పండగలకు ,పెళ్ళిళ్ళకు ప్రత్యేక సందర్భాలకు గోరింటాకు పెట్టుకొంటారు అమ్మాయిలు. చుక్కలు ,ఆకులు డిజైన్ లు పెట్టుకొనే వాళ్లు అటు తరువాత కోన్స్ తో మెహాందీ డిజైన్స్ ఫ్యాషనయ్యాయి. ఒక్కళ్ళ అభిరుచికి తగ్గట్లు మోచేతుల దాకా చక్కని డిజైన్లు వేయించుకొంటారు. ఇది కాస్త ఇంకో అడుగు ముందుకు వేసి మెహాంది టెంపరరీ టాటూలు వచ్చాయి. మామూలు టెంపరరీ టాటూల మాదిరిగానే అతికించి తడిచేసి పైన ఉండే కాగితం తీసేస్తే డిజైన్ పడిపోతుంది. చేతులకు కాళ్ళకు ఎన్నో చక్కని డిజైన్స్ ..వీటిని నిమిషంలో మార్చుకోవచ్చు. బేబీ ఆయిల్ కానీ ,కోల్డ్ క్రీమ్ గానీ దీని పైన రాసి రుద్దితే చేతులు మామూలుగా అయిపోతాయి. మళ్ళీకొత్త డిజైన్ మెహాందీ టెంపరరీ టాటూ అతికించుకోవచ్చు.

Leave a comment