Categories
మౌనవ్రతం చేయమంటున్నాయి పరిశోధనలు . కరక్టే మౌనంగా ,నిశ్శబ్ధంగా కొన్ని గంటలపాటు ఉంటే మెదడు కొత్త ఆలోచనలు చేస్తుందట. మరీ కోపం వచ్చిన ,ఒత్తిడికి గురైన రెండు గంటలు ఎవరితోనూ మాట్లాడకండి. ఆ సమయంలో మెదడులోని హిప్పోకేంపస్ అనే భాగంలో కొత్త కణాలు పుడతాయట. ఈ కణాలు కొత్త ఆవిష్కరణలు చేసేంత శక్తి వంతంగా ఉంటాయట. ఫ్రెష్ గా మెదడు ఆలోచించుకోవాలంటే మౌనం గా ఉండాలి. ఇదే ఔషధం అంటున్నాయి పరిశోధనలు .భావోద్వేగాలను ,జ్ఞాపకాలను హిప్పోకేంపస్ నియంత్రిస్తుంది. ఈ ప్రాంతంలో కొత్త కణాలు ఏర్పాడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.