Categories

రుచికరమైన , విలవైన ధాన్యాల్లో సజ్జలు ఒకటి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు తప్పని సరిగా తీసుకోవలసిన ఆహారం ఇది. పుష్కలంగా పాలు పడతాయి అలాగే మహిళలకు రుతుసమయంలో వచ్చే మెన్ స్ట్రువల్ క్రాంప్సే కూడా తగ్గుతాయి. సజ్జల్లో ఉండే ఫాస్పరస్ ఎముకలను ధృఢంగా మార్చుతుంది. కండరాలను శక్తి మంతంగా చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ పాళ్ళను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్ హైడెన్సిటీ లైపోప్రోటీన్ పాళ్ళను పెంచి రక్తనాళాలుపెలుసు భారకుండా కాపాడుతాయి . సజ్జల్లో పుష్కలంగా ఉండే ట్రిస్టా అనే అమైనో ఎంజైమ్ త్వరగా కడుపునిండేలా సంతృప్త భావనను పెంచుతోంది. బరువు తగ్గాలనుకొంటే సజ్జలు మంచి ఆహారం.