Categories
చాలా మంది పనిచేస్తూ ,టీవి చూస్తూ స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. గంటా రెండు గంటలకు బిస్కెట్లు ,చిప్స్ వంటివి తినేస్తారు. ఈ అలవాటు వాళ్ళకి శరీరం బరువు పెంచేస్తున్నదని చెపుతున్నారు ఎక్ పర్ట్స్. ఇలా స్నాక్స్ తింటే శరీరంలోకి ఏడాదికి లక్ష కెలరీలు అదనంగా వచ్చిపడి పోతాయి. నాలుగైదు బిస్కెట్లు తినేసి ఓ కప్పు కాఫీ తాగేసి ఏ ముంది సింపుల్ గా అనుకొంటే తప్పులో కాలేసినట్లే . 80 నుంచి 100 కాలరీలు అదనంగా శరీరంలో చేరుతాయి. ఒక్క చిన్న కేక్ లో పది పన్నేండు గ్రాముల కొవ్వు 300నుంచి 400 కేలరీలు ఉంటాయి. ఇది రోజుకు ఒక్కటీ తిన్న ఊబకాయం వచ్చేసినట్లే . కూర్చుని పని చేసే మహిళలు ముఖ్యంగా ఈ చిరుతిండికి దూరంగా ఉండాలంటున్నారు.