Categories
ప్యాకెట్ ఫుడ్ తో ఎన్నో అనారోగ్యాలు అని ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ప్యాకెజింగ్ కు వాడే పదార్ధాల కారణంగా పోషకాలు వంటబట్టకుండా పోతున్నాయని బర్మింగ్ హాట్ మన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇంకో కొత్త విషయాన్ని చెపుతున్నారు. ప్యాకెట్ల లైనింగ్ లో జంక్ ఆక్సైడ్ వాడతారు. బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ద్వారా ఆహారం పాడవకుండా ఈ జంక్ ఆక్సైడ్ అడ్డుకుంటుంది. అయితే ఇది నానో స్థాయి ఆహారంలో చేరుతుందని ఈ కారణంగా పేగుల్లో కణాలు సక్రమంగా పని చేయకపోవటం వల్ల ఆహారంలోని పోషకాలు శరీరానికి అందకుండా వృధాగా బయటకు వెల్లిపోతున్నాయని కనుగొన్నారు, ఏ విధంగా చూసిన ప్యాకెట్ ఫుడ్ , ప్యాకెజింగ్ కు వాడే పదార్ధాలు కూడా శరీరానికి నష్టమే చేస్తాయి.