Categories
ఏ ఇంటార్వ్యూ కో వెళ్ళినప్పుడో ,ఎవరైన పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఆవులిస్తే అస్సలు బావుండదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆవులింతలు సహాజమే అయినప్పటికీ కొన్నీ సార్లు అవి బద్దకాన్ని ,నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నట్లు ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గితే దాని ప్రతి స్పందన ఆవులింత అంటారు. మెదడు ఉష్టోగ్రతను క్రమ బద్దీకరించుకోవటంతో శారీరక స్పందన ఇది. అని కూడా అంటారు. నిద్ర లేమి వల్ల కూడా ఆవులింతలు రావచ్చు .జనరల్ గా యాగ్జయిటీ కావచ్చు కారణాలు ఏమైన కావచ్చు కానీ ఈ ఆవులింత మనం సీరియస్ గా ఉన్నా సందర్భాన్ని నిర్లక్ష్యపూరితంగా చేస్తాయి కనుక ఇలా ఆవులింతలు వదలక పోతే ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయమంటున్నారు.