ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అది ప్రపంచం దృష్టిలో పడాలి అటు తర్వాత వచ్చే గుర్తింపుతో కెరీర్ పరుగు పెడుతుంది. కెన్స్ ఉత్సవంలో సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్ పైన చేతులకు గోరింటాకు చెవులకు కమ్మలు ధరించి నడిచింది. ఆస్ట్రేలియాకు చెందిన Tamara ralph&russo’s ప్రముఖ డిజైనర్స్ 9,500 గంటలు కష్టపడి సోనమ్ కపూర్ డ్రెస్ డిజైన్ చేశారు. 43 వేల క్రిస్టల్స్ ను డ్రెస్ డిజైనింగ్ లో ఉపయోగించారు. లండన్ లో ఈ డ్రెస్ డిజైనింగ్ కోసం కొన్ని నెలలపాటు ఉన్నారు. 2016 కెన్స్ చిత్రోత్సవంలో కూడా సోనమ్ కపూర్ వీరు రూపోందించిన డ్రస్ నే ధరించింది.