Categories
అబద్దాలు చెప్పడంలో ఆడవాళ్ళు ముందుంటారు అంటారు కాని ఈ విషయంలో మగవాళ్ళదే పై చేయి అంటున్నాయి అధ్యాయనాలు.పురుషులు రోజుకు అనేకసార్లు అబద్దాలు చెబితే స్త్రీలు రోజుకు మూడుసార్లు మాత్రమే అబద్దాలు చెపుతారట. బావోద్వేగాలు వెల్లడించటంలో పురుషులే ముందుంటారు. ప్రేమ,కోపం తదితర భావాలు ముందుగా వ్యక్తం చేస్తారు. అలాగే స్త్రీలు అంత త్వరగా బయటపడరు. బాధను స్త్రీలు ఓర్చుకున్నంతగా పురుషులు ఓర్చుకోలేరు. ఉరుములు ఉరిమినా సరే పురుషులే ఎక్కువ బయపడతారట. ఏదైన ఆడవాళ్ళు చెబుతుంటే సోది వినడం ఇష్టం లేదంటూ వెళ్ళిపోతారు. కాని నిజానికి స్త్రీలు చెప్పే విషయాలు గ్రహించలేకనే అలా వెళ్ళిపోతారంటున్నాయి అధ్యాయనాలు.