పోషకాలు పోకుండా పదార్థాలు తయారు చేయటం ఒక గొప్ప ఆర్ట్ ఆవిరి పై ఉడికించే పద్ధతి అన్నింటికంటే ఆరోగ్యకరమైనది. ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో మరొక పాత్రలో పదార్థాలు వేసి ఉంచి మూతపెట్టి ఉడికించడం అన్నమాట. ఉడికే పదార్థం అడుగున నీటిలో కలవదు ఆ ఉడికే నీళ్ళలో పాత్రలో పెట్టిన పదార్ధాలు మగ్గిపోతాయి సరైన తేమతో ఉంటాయి. నీళ్లతో సంబంధం లేదు కాబట్టి పోషకాలు నీళ్ళలో కలిసిపోవు మిగతా ఉడికించే  పదార్థాలతో పోలిస్తే వీటిలో గ్లైకోమిక్  ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. శరీరం వీటిని త్వరగా గ్రహిస్తుంది జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది కనుక రక్తంలో చక్కెర స్థాయిలు ఇన్సులిన్ కూడా చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కొవ్వులు స్పైస్ లను ఆహారం స్టీమ్ చేశాక కలుపుకోవచ్చు.

Leave a comment