కళ్ళకు నచ్చితేనే ఇష్టంగా తింటారు పిల్లలు అప్పుడు కాస్త రుచిగా ఉంటే తల్లులను ఇబ్బంది పెట్టకుండా హాయిగా బోంచేస్తారు.ఇంస్టాగ్రామ్ కొంతమంది తల్లులు హెల్తి ఫుడ్ నీ మరింత ఆకర్షణీయంగా అమర్చేసి చూపిస్తున్నారు.మలేషియాకు చెందిన ఫుడ్‌ ఆర్టిస్ట్‌ సమంతా లీ ఫుడ్‌ను డిస్నీ క్యారెక్టర్ల రూపంలో పిల్లలకు ఇస్తారు.జపాన్ కు చెందిన ఫుడ్ ఆర్టిస్ట్‌  బ్లాగర్ ఇటోని మమా ఫుడ్‌ను కార్టూన్‌ బొమ్మలు, జంతువుల బొమ్మలుగా అలంకరిస్తున్నారు.ఫ్రై చేసిన గుడ్లను సలాడ్స్‌, అన్నం, పండ్ల ముక్కలతో ఈ ఫుడ్ నీ అలంకరిస్తారు.  జాకబ్‌ ఫుడ్‌ డెయిరీలో పనిచేసే లలేహ్‌ మహ్మదీ తన కుమారుడికి ఫన్నీ ఫుడ్‌ ఆర్ట్‌ ద్వారా ఆరోగ్యకరమైన ఫుడ్‌ అలవాటు చేశారు..వీరి ఫుడ్ ఆర్ట్ ని చూసి  పిల్లలకు ఇష్టమయ్యే  బొమ్మల రూపంలో ఫుడ్ అలంకరించవచ్చు.

Leave a comment