Categories

బయట చాలా చక్కగా కనబడే వాళ్ళు ఫోటోల్లో అంతబావుండరు. అలాంటప్పుడు మరీ ఎక్కువ మేకప్ లేకుండా కొన్నీ జాగ్రత్తలు తీసుకొంటే ఫోటోల్లో మెరిసి పోవచ్చు. షిమ్మర్,హైలైటర్ వంటివి వీలైనంత తక్కవ వాడాలి. కెమెరా ఫ్లాష్ తో మొహాం జిడ్డుతో ఉన్నట్లు కనబడుతుంది. మెరిసే ఐలైనర్లు వాడవద్దు. వెలుతురుగా ఉన్న చోట మేకప్ వేసుకోవాలి.అప్పుడే మస్కార ,లిప్ లైనర్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఫౌండెషన్ ముఖం మెడకు కలిసి వేసుకోవాలి. మెడ తేడాగా ఉండకుండా ఉంటుంది. ఫౌండెషన్ ,పౌడర్ అద్దుకొనేనటప్పుడు ఫ్యాషన్ బ్రష్ వాడితే ముఖమంతా చక్కగా పరుచుకొంటుంది.