Categories
వీకెండ్ పార్టీలు కాస్త రిలాక్సేషన్ ఇస్తాయి కానీ తరుచు ఇలాంటి భోజనాలు గుండెకు హాని చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారం రోజుల్లో ఐదు రోజులు విశ్రాంతి లేని పని తర్వాత తప్పకుండా బయటి భోజనాలు నలుగురితో పార్టీలు ఇష్టపడతారు. కానీ ఎక్కువ క్యాలరీలు ,అవసరానికి మించిన ఆహారం తినటం ,బయట తయారయ్యే శభ్రత లేని మాంసం,మాటి మాటికి వేడి చేసే నూనెల వల్ల ఆరోగ్యానికి నష్టమే. ఒక వేళ సామాజిక కార్యక్రమాల్లో బయట తిన వలసి వస్తే విభిన్నమైన రుచుల నుంచి తేలికగా అరిగేవి ఆరోగ్యవంతమైనవే ఎంచుకొమ్మంటున్నారు.