Categories
వికారాబాద్ కు చెందిన కుడుగుంట స్నేహారెడ్డి హైదరాబాద్ ఐఐటీ (కంది-సంగారెడ్డి)లో బీటెక్ పూర్తిచేసింది. నేచురల్ ల్యాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్’ అనే అంశం పై పరిశోధనలు చేస్తున్న గూగుల్ సంస్థ.. ఈ ప్రాజెక్టులో పని చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఐదుగురిని ఎంపిక చేసింది. వీరిలో స్నేహారెడ్డి ఒకరు. ఆమె ప్రతిభను గూగుల్ మెచ్చి రూ. 1.5 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం కల్పించింది.