ప్రపంచాన్ని మార్చేందుకు వ్యక్తులు బాగా చదువుకుని ,మేధావులపై ఎన్నో నైపుణ్యాలతో ఉండనక్కర్లేదు. కాస్త మనసుంటే చాలు. జో క్యారూన్ అనే ఒక ఏడేళ్ళపాప అమ్మమ్మగారింటికి వెళుతూ రోడ్డుపైన కనిపించిన లైన్ మెన్ అనే బోర్డు చూసి లైన్ ఉమెన్ కూడా పనిచేస్తూన్నప్పుడు లైన్ మెన్ అని పెట్టటం ఏమిటని న్యూజిలాండ్ ట్రాన్స్ ఫోర్ట్ అథారీటీకి ఉత్తరం రాసేసింది. రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్నప్పడు వాహానదారులకు అప్రమత్తం చేసేందుకు మెన్ ఎట్ వర్క్ అనే బోర్డు పెడతారు జో క్యారూన్ దీన్ని తప్పుపట్టి స్త్రీ పురుషులు ఇద్దరూ పని చేస్తున్నప్పుడు ఈ బోర్డేమిటని అడిగింది. న్యూజిలాండ్ ట్రాన్స్ ఫోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇక నుంచి తను బోర్డులపై పర్సన్స్ ఎట్ వర్క్ అని రాయబోతున్నారు.