Categories
పూజలు,వ్రతాలు,పిలుపుల్లో కుంకుమ భరణి ఉండాల్సిందే.బంగారం,వెండితో చేసిన గుండ్రనివో లేదా పొడుగ్గా డబ్బలాగా ఉండేవో పూర్వం ఉండేవి. ఇప్పుడు రూపురేఖలు మారిపొయాయి. బంగారు కుంకుమ భరిణెలు,ముత్యాలు ,పచ్చల కెంపులతో ఎన్నెన్నో ఆకృతులలో పండగ శోభను కనబడేలా చేస్తున్నాయి. దేవతా రూపాలు,ఏనుగులు,నెమళ్ళు ఇలా ఎన్నో చక్కని డిజైన్లు కనిపిస్తున్నాయి.వెండి,బంగారం మాత్రమే కాదు వన్ గ్రామ్ గోల్డ్ కుంకుమ భరణి లకైతే ఎంతో డిమాండ్ కూడా ఉంది.ఈ పండగ రోజుల్లో కుంకుమ భరిణలు కానుకగా ఇస్తారు కదా.