తామర గింజలు తామర కాడ లోపల భాగాల కోసం వేళ్ళ లోని దుంప కోసం చైనాలో వేల ఎకరాల్లో తామరను పెంచుతారట. వేయించిన తామర గింజల్నీ కూరలుగా వండుతారు.పిండిలో,కేక్ లలో ఐస్ క్రీమ్స్ లో వాడతారు. తామర మన దృష్టిలో అందమైన పువ్వు ఇందులో ఉండే పోషకాలకు అంతులేదు. ఈ పూ రేకులను గ్రీన్ టీలా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఫుడ్ డెకరేషన్లో వంటల్లో తామర పూలు కాడలు వాడతారు. దుంపలు,కాడలు ఉడికించి తింటె మంచిది. వీటిలో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు ఎన్నో విటమిన్లు దొరుకుతాయి.తామర మొక్కలలోని అన్ని భాగలు ఎప్పటి నుంచో ఆయుర్వేద మందుల్లో,సంప్రదాయ వైద్యాల్లో ఉపయోగిస్తున్నారు. పువ్వు రేకులను ఫేషియల్ క్రిమ్ లలో వాడతారు.

Leave a comment