ప్రేమకు సంబధించి పెళ్ళికి సంబందించిన నమ్మకాలు ఎప్పటికీ పాతబడవు. ప్రపంచంలో ప్రేమకు మరణం ఉండదు.జర్మనీలోని డోడోవా ఫాస్ట్ అడవిలోని ఓ చెట్టు గొప్ప టూరిస్ట్ ఎట్రాక్షన్.ఒక చెట్టును చూసేందుకు ఎంతో మంది టూరిస్టులు వస్తారు. ఇది ఐదు వందల ఏళ్ళనాటి ఒక చెట్టు .దాని తొర్ర ఒక పోస్ట్ బాక్స్. ఆ చెట్టుకు ఉత్తరం రాస్తే పెళ్ళైపోతుందని ప్రేమికులకు నమ్మకం. 128 ఏళ్ళ నుంచి ఈ పరంపర కొనసాగుతుంది.అప్పుడో జంట ప్రేమించుకొని,వాళ్ళు రాసుకొన్న లెటర్స్ ఈ చెట్టు తోర్రలో ఉంచి చదువుకొని ఆ తర్వాత పెళ్ళాడాట. వాళ్ళ ప్రేమను సఫలం చేసినందుకు ఈ చెట్టుకు ఉత్తరలు రాస్తే ప్రేమ సఫలం అవుతందని ఓ నమ్మకం . సంవత్పరానికి వెయ్యికి పైగా ఉత్తరాలు వస్తాయట.చెట్టు పేరు బ్రేయిడ్ గూమ్ ఓక్.