శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా నొప్పులు ఎక్కువవుతాయి . కూర్చోవటం మెట్లెక్కటం కూడా చేయలేక పోతారు. పాలు జున్ను పుట్ట గొడుగులు ఆరెంజ్ జ్యూస్ పెరుగు గుడ్డు సోన వంటి వాటిలో డి విటమిన్ ఉంటుంది. అలాగే ఐరన్  లోపిస్తే రక్త హీనత వచ్చే ప్రమాదం వుంది . పాలకూర ఎర్ర కందిపప్పు ఓట్స్ చేపలు బీన్స్ నుంచి ఇనుమును అత్యధికంగా పొందవచ్చు. నిమ్మజాతి పండ్లు ఆకుకూరల తో విటమిన్ సి శరీరానికి లభిస్తుంది. మాంసకృతులు శరీరంలో కొత్త కణాల అభివృద్ధి కి తోడ్పడతాయి. గుడ్లు మాంసం నట్స్  డైరీ పదార్ధాల నుంచి మాంస కృతులు అందుతాయి. బరువు పెరుగుతామనే భయంతో కొవ్వుల్ని దగ్గరకు రానివ్వడు కానీ ప్రతిరోజు ఇరవై శాతం కేలరీలు కొవ్వుల నుంచే లభించాలి. విటమిన్ బి లోపిస్తే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుడ్లు పాలు బీన్స్ మాంసాహారం రోజు తీసుకోవాలి. ఇవన్నీ సరైన నిష్పత్తి లో అందితే శరీరంలో అందం ఆరోగ్యం రెండు భద్రంగా ఉంటాయి.

Leave a comment