కొలెస్ట్రాల్ స్థాయిల్ని రక్తపోటును కొలతలు వేసినట్లు ఎమోషనల్ ఆరోగ్యాన్ని కొలతలు వేయటం సాధ్యం కాదు. అయితే భావోద్వేగ అనుకూలత ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అందరికీ తెలుసు. డిప్రెషన్ కు కార్డియో వ్యాస్కులర్ రుగ్మతలను నడుమ ఎక్కువ సంభంధం ఉంటుంది. జీవితం పట్ల గల సంతృప్తి గుండె జబ్బుల ముప్పు తగ్గిస్తుందా ? ఈ విషయమై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించారు . హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు. సంతోషానికి సంబంధించిన ఎనిమిది అంశాలు వారు సృజించారు. వివాహం ప్రేమ తీరిగ్గా చేసే కార్యకలాపాలు జీవన ప్రమాణాలు ఆరోగ్యం కుటుంబ జీవనం శృంగార జీవనం వ్యక్తిగత భావాలు జీవితంపై ఎక్కువ ప్రభావం చూపే అంశాలు మొత్తం మ్మీద  సంతృప్తికరంగా వుండే వారిలో 26 శాతం గుండె సంబంధిత రుగ్మతలకు అవకాశం తక్కువగా ఉంటుందని గుర్తించారు. రిస్క్ తగ్గించే అంశాల్లో ఉద్యోగం కుటుంబం సెక్స్ వ్యక్తిగత భావాలు ఉన్నాయి. అంటే భావోద్వేగ సంతోషానికి కాలమానం ఆరోగ్యమే అయితే అందుకు అవసరమైనవి సంతోషంతో కూడిన జీవితం అన్న మాటేగా !

Leave a comment