టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న చోట లవంగాలు నీళ్లు లేదా పాలతో కలిపి మెత్తగా నూరి అప్లయ్ చేసి పదినిమిషాలు పాటు ఆరనిచ్చి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. పూదీనా ఆకులు నూరి ఆ పేస్ట్ ను మొటిమల పై రాసినా మార్పు కనిపిస్తుంది. పుదీనా తో  చర్మానికి చల్లదనాన్ని పాక్ లాగా  అప్లయ్  చేసినా మంచిదే. ఎండా బెట్టిన తులసి ఆకులు షాపుల్లో దొరుకుతాయి. దాన్ని నీళ్లలో కలిపి పేస్ట్ లాగ చేసిన రాసినా మొటిమలు తగ్గుతాయి. బజార్లో దొరికే ఖరీదైన మందుల కంటే ఈ సహజమైన పద్ధతులే ఫలితాలు ఇస్తాయి.

Leave a comment