ఇప్పుడందరి చేతుల్లో ఫోన్లే . సెల్ ఫోన్ ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా వాడుకుంటే ప్రాబ్లమే  లేదు. సినిమాలో మునిగిపోయి హాయిగా చూస్తూ ఉంటాం… మన వెనక నుంచీ వెనకట లక్ష్మి బేబి సినిమా హల్లో ఉన్నానే అని ఎవరో మహానుభావుడు వీళ్ళావిడ తో పెద్దగా అరిచి చెపుతుంటే చుట్టూ పక్కలవాళ్ళు జడుచుకోరూ… అందుకే కొన్ని మర్యాదలు పాటిస్తే గౌరవంగా ఉంటుంది . మొదటిది సెల్ ఫోన్ లో పాటలు వినటం మంచి అభిరుచే. కానీ అది అవతలి వాళ్లకు  తలనొప్పి రాకూడదు. నలుగురితో మాట్లాడుతూ ఉంటే మధ్యలో వ్యక్తిగత ఫోన్ వస్తే ఇక ఇతర్లని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉండటం మధ్యలో వ్యక్తిగత ఫోన్ వస్తే ఇక  ఇతర్లని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉండటం అమర్యాదే. పార్టీలో సమావేశాల్లో సెల్ ఫోన్ స్విచ్ సైలెంట్ లో ఉండాలి. గంటలు గంటలు ఆలా మాట్లాడుతూ ఉంటే ఆ రేడియేషన్ ప్రభావం మెదడు పైన ఉంటుందని వింటున్నాం. సెల్ ఫోన్ కి ఓ రింగ్ టోన్ ఉంటుంది. అది పదిమంది విని మన వైపు తిరిగి ఆ ఫొనేదో వచ్చింది చూసుకో అన్నట్లు మొహం పెట్టేదాకా అలా మోగనివ్వద్దు. మన సంభాషణలు ఇతరులకు ఎబ్బెట్టుగా ఉండచ్చు. అంచేత అవి ఇతరులు  వినకుండా  పరిమితం చేసుకోవాలి. టాయిలెట్స్ లో సెల్ ఫోన్ లో మాట్లాడకూడదు . డ్రైవింగ్ చేస్తూ అస్సలు వద్దు. పెద్దగా చుట్టు పక్కల ఓ మైలు దూరం వినిపించేంత గట్టిగ అస్సలు మాట్లాడద్దు. సెల్  ఫోన్ లు లేకుండా గడవదు అంటాం కనుక సెల్ ఫోన్ మర్యాదలు పాటించి తీరాలి.

Leave a comment