ఇంట్లో తయారు చేసుకునేందుకు ఇంటరెస్ట్ చూపించం కానీ. కొన్ని నూనెలు చాలా మంచి ఫలితం ఇస్తుంది. షాపులో ఉన్న మంచి కంపెనీ ఆయిల్స్ సీసా పైన అందులో వాడిన వస్తువుల జాబితా ఇస్తారు కానీ ఖరీదైనవి తక్కువ ఖర్చు తో జుట్టు నల్లగా అయిపోయేందుకు ఆయిల్ ఇంట్లోనే తయ్యారు చేసుకోవచ్చు. ఒక కప్పు గోరింటాకు , ఉసిరికాయ ముక్కలు ఒక రాత్రి నీళ్ళల్లో నాననిచ్చి తెల్లారి గ్రయిండ్ చేసి దాన్ని కొబ్బరి నూనెలో కలిపి కాసేపు మరగనిచ్చి , ఆ నూనె వడకట్టి బాటిల్ లో వేసి నిలువ చేసుకుంటే జుట్టుకు ప్రతి రోజు రాసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేని చక్కని ఈ నూనె జుట్టు కుదుళ్ళ కు బలంగా ఉంచి నల్లగా ఒత్తుగా జుట్టు పెరిగేలా చేస్తాయి.

Leave a comment