-డి. సుజాతాదేవి
నల్లని ఎన్నెల్లో
సక్కంగ సాగింది
సన్నాయి రాగాల పాట

అమవాస సీకగటిలో
ఆగిపోయేన
ఆ పూల పాట
ఇనిపించదా పూట పూట!!

పచ్చనీ తోటల్లొ
పరుగెత్తి ఆడింది
పొగడపూలా గాలి పాట
మోడైన అడవుల్లొ
మాబు మణిగేన
ఇనిపించదా పూట పూట!!

తూరుపూ కొండల్లొ
తొంగి తొంగి చూసె
వేగు సుక్కా మల్లె పాట
ఎర్రనీ ఎండల్లొ
ఇంకిపోయేన
నా తేనె పాట
ఇనిపించదా పూట పూట!!

Leave a comment