-డి. సుజాతాదేవి
తొలి యెలుగు తొంగి సూసి
మావకోస మెదికింది
మలి పొద్దు ఊరి సివర
మావకోస మాగింది !!

డొంకదారి వంకలోన
ఒరిగి ఒరిగి మావికొమ్మ
ఊగూగి పిలిసింది
ఆగాగు మావేడంది !!

సెరువుగట్టు సిన్నవోయె
కాలిదారి మూగవోయె
కందిసెను కలవరపడుతూ
మల్లీ నీ మావేడంది !!

మాపిటేల గూటి దీపం
ఊపిరంద కారిపోయె
సందమావ పక్క తడిమి
సుక్కా నీ మావేడండి !!

Leave a comment