Categories

కొత్త భాషలు నాకు చాలా ఇష్టం, హింది,ఇంగ్లీష్,మరాఠి,జర్మన్ భాషాలు అనర్గళంగా మట్లాడతా. హైదరాబాద్ వచ్చాక తెలుగు నేర్చుకుంటున్న అంటుంది నర్తనశాల హీరోయిన్ కాశ్మీరి పరదేశి. మాది పూణే. ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ కమ్యూనికేషన్ కోర్సు చేశాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్ అసలు సినిమాలకు మా కుటుంబానికి అసలు సంబంధం లేదు. సినిమాల పై ఇష్టం కొద్ది ఇటు వచ్చేశా.మొదటిసారి నర్తనశాల ఆడిషన్ లో సక్సెస్ అయిపోయా నేను చూసిన పాత నర్తనశాల కు దీనికి సంబంధంలేదు.సినిమా బాగుంటుందని కితాబిచ్చింది కాశ్మీరి పరదేశి. స్వతహాగా నాట్య కళాకారిణి కావడంతో ఆమె మొఖంలో అన్ని భావలు పలికాయంటుంది నర్తనశాల యూనిట్ అంతా.