Categories
మనకి టీ కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఫ్లేవర్స్ తో వందల రకాల టీలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో టీ తయారికి పెట్టింది పెరు. అలాంటి వాటిలో కోల్ కతా స్ట్రీట్ చాయ్ చాలా ప్రసిద్ది. అక్కడ ప్రతి విధీలోనూ చిన్న మట్టి కుండల్లో టీ ఇచ్చే దుకాణాలు ఉంటాయి. పాలు టీ పొడి మరిగించి అల్లం,ఇలాచీ పోడి కలిపి జాజికాయ పొడి అమెరికన్ కుంకుమ పువ్వు కలిపి తయారు చేసే ఆ స్ట్రీట్ చాయ్ రుచి అద్భుతం అంటారు. ఆ టీ తాగితే మెదడు చురుగ్గా ఉత్సహాంగా అయిపోతుంది అంటారు రుచిచూసిన వాళ్ళు. అది బెస్ట్ ఇండియన్ స్ట్రీట్ చాయ్ గా పేరు తెచ్చుకుంది.