Categories
కొన్ని పరిశోధనల గురించి క్షుణంగా చదవాలి . అవి మనకు ఆరోగ్యపరంగా మేలు చేసేవి అయితే వెంటనే ఆచరణలో పెట్టాలి కూడా. బరువు తగ్గాలి అనుకొంటే మనం తీసుకోవలసిన ఆహారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నాం 12 గంటలలోపునే తీసుకోవాలి అంటున్నాయి పరిశోధనలు. కొన్నీ వందల మందికి ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొద్దీగా ఆహారం ఇస్తూ జీవక్రియలు వేగాన్ని ,కొవ్వు కరిగే క్రమాన్ని రికార్డు చేశారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ఆ హారం తీసుకొంటే కొవ్వు కరగటంతో పాటు జీవక్రియల వేగం కూడా చాలా తక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు . ఈ అధ్యయనం పలుమార్లు నిర్వహంచాక ఈ సమయంలో ఆహారం తీసుకొంటే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు.