చెప్పులు లేని వట్టి పాదాలతో తడిగడ్డిపైనో, నేలపైనో అడుగులు వేస్తే ఆహ్లాదమే కాదు అదనపు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. నేలకు శరీరక భాగం తగిలి ఏ భాగంలో నొప్పులున్న తగ్గుటానికి ఉపకరిస్తుంది. భూమిలోని ఛార్జెడ్ ఎలక్ట్రాన్స్ ను శరీరం గ్రహిస్తుందనీ పరిశోధకులు చెపుతున్నారు. పాదాలకు భూమి తాకటం యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. ఇన్ ఫ్లమేషన్ కు కారణం అయ్యే పాజిటివ్ ఫ్రీ రాడికల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఒక 20 నిమిషాల ఎర్తింగ్ నొప్పిని ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. 40 నిమిషాలు నడిస్తే బ్లడ్ విస్కోసిటిని తగ్గిస్తుందని చెపుతున్నారు. అంటే హార్ట్ ఎటాక్స్ స్ట్రోక్ కు కారణం అయ్యే చిక్కని రక్తాన్ని పల్చన చేస్తుందని చెపుతున్నారు. పార్క్ లోనూ ఇంటి ముందరో చెప్పుల్లేని కాళ్ళతో నడిస్తే మంచిది.
Categories