Categories
పక్షులు,పువ్వులు ఇష్టం లేనిదెవ్వరు.పచ్చని ఆకులు ఆ మద్యలో పక్షులకు కొలువు దోరికితే కళ్ళకెంత ఊరట. ఆనందం. ఈ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాకా అసలు ఒక పిచ్చుక అయినా ఎక్కడైన వాలి కాపురం పెట్టే అవకాశం ఉందా? కానీ ఈ కోరిక తీర్చే కృత్రిమ పక్షులు,పక్షి గూళ్ళు మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ లేదా సింథటిక్ ఫర్ తో రూపోందించిన పక్షులు ఒకటైతే టాక్సీ డెర్మీ పద్దతిలో చనిపోయిన పక్షులు యాధావిధిగా అలాగే ఉండేలా వాటి లోపల దూరిపెట్టి కూరి కుట్టేసిన పక్షులు అచ్చం బతికున్న పక్షులు లాగే ఉంటాయి.అవి ఎంతకాలం అయినా పాడైపోవు. సింథటిక్ ప్లాస్టిక్ పక్షులు సరే సరి. కాస్త దుమ్ము దూళీ లేకుండా శుభ్రంగా ఉంటే చాలు. ఒకటో రెండో గూళ్ళు కొని పక్షులు కొని తెచ్చుకుంటే ఇంటికే అందం. మన మనసుకి ఆనందం.