Categories

అందం కంటే సినిమా తారలకు నటనే ముఖ్యమైన క్వాలిఫికేషన్ అంటుంది తమన్నా. అందం కేవలం ఆకర్షణ్లో పుట్టుకొస్తుంది. మనకంటే అందమైన వాళ్ళు వస్తే మనం వెనకబడిపోతాం,అసలు నటీమణుల జీవితకాలం వెండి తెర పై చాలా తక్కువ కానీ నటనే ముఖ్యమైన అలంకారంగా ఉన్న హీరోయిన్స్ ఎంతో కాలం వెండితెర ఏలారు అంటుంది తమన్నా. గొప్ప కథానయకలు అంతా అద్భుతమైన అందగత్తెలు కాదు.వాళ్ళలో అభినయం,నటన ఎక్కువపాళ్ళు ఉన్నాయి. నటిగా నా పై ముద్రపడాలని అనుకుంటున్న. నేను గ్లామర్ తారని అంటే ఆనందంగానే ఉంటుంది కానీ తమన్న అద్భుతంగా నటించింది అన్న పొగడ్త వింటే ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది,నాకు మంచి నటి అన్న గుర్తింపు వస్తే చాలు అంటుంది తమన్నా.