Categories
ఎక్కువ గాఢత గల కాస్మోటిక్ ఉత్పత్తులు వాడటం వల్ల టవల్ తో ముఖాన్ని పదే పదే గట్టిగా తుడుచుకోవటం వల్ల కూడా చర్మ రంధ్రాలు ఎన్ లార్జ్ అయి ఓపెన్ ఫోర్స్ ఏర్పడటానికి కారణం అవుతాయి. ఆ తరువాత స్వేదం, మురికి, జిడ్డు ఈ రంధ్రాల్లో పెరుకుపోయి మొటిమలు ,నల్లని గుల్లలు మార్పుల వల్లనూ, వాతావరణం వల్ల కూడా చర్మ రంధ్రలు పెద్దవిగా కనిపించవచ్చు. ఒత్తిడి అధిక నూనె ఉత్పత్తికి కారణమై రంధ్రాలు ఎన్ లార్జ్ అయి కనబడుతు ఉంటాయి.,కొన్ని కాస్మోటిక్స్ వల్ల కూడా ఇలా కావచ్చు .,అందుకే చర్మాన్ని పగలు రాత్రి క్లెన్స్ చేస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖంపై లూఫా వాడకుండా స్క్రబ్ చేసి వదిలేయాలి. తేనే ,నిమ్మరసం ,టోమోటో ,కీర రసం,పెరుగు , గుడ్డులో తెల్లసొన వంటి వంటింటి చిట్కాలే పోర్స్ సమస్యను తగ్గిస్తాయి.