కత్రినా కైఫ్ అంత అందమైన అమ్మాయి ఇంకెవళ్ళు లేరనిపిస్తోంది కొన్నీ ఫోటోలు చూస్తుంటే. కానీ తన చక్కని ఆకృతికి ఫిట్ నెస్ కి తన ట్రైనర్ యాస్మిన్ కరాబీ వాలా కారణం అంటుంది కత్రినా. మొదటిసారి యాస్మిన్ ను కలిసేనాటికి కత్రినా యోగా ,వెయిట్ ట్రైనింగ్ మాత్రమే చేస్తూ ఉండేది.  యాస్మిన్ కత్రినా వర్కవట్స్ లో ఫక్షనల్ ట్రైనింగ్ పిలేట్స్ జత చేసింది. పూర్తిగా శరీరం ట్యూన్ అవటానికి ధృడమైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయటానికి వెన్నెముకకు సపోర్ట్ కోసం ఈ వ్యాయమాలు ఉపకరిస్తాయి. పిలెట్స్ కార్డియోలతో పాటు టి.ఆర్.ఎక్స్, పవర్ ప్లేట్, కెటిల్ బెల్స్ ,మెడిసిన్ స్విస్ బాల్స్ పై అనేక వ్యాయమాలు చేసి ఫిట్నెస్ సాధించింది కత్రినా. ఆమె వారంలో ఏడు రోజులు రొజుకు మూడు గంటల పాటు ఈ వ్యాయమాలు అన్ని చేస్తుంది.

Leave a comment