రోడ్ల పైన ఉండే రద్దీ తో డ్రైవింగ్ చేసేవాళ్ళ కి ఎప్పుడు మనసులో ఒత్తిడిగానే ఉంటుంది . ప్రతిరోజు ట్రాఫిక్ లో ప్రయాణం చేసేవాళ్ళకి ఈ ఒత్తిడి గుండె పైన ప్రభావం చూపిస్తోందిని ఎక్స్ పర్డ్స్ చెపుతున్నారు . అయితే సంగీతం ఈ ఒత్తిడిని తగ్గిస్తోంది అంటారు . ప్రతిరోజూ రద్దీగా ఉండే రోడ్ల పైన డ్రైవింగ్ చేసేవాళ్ళు మ్యూజిక్ వింటూ వాహనం నడిపితే అంత ఒత్తిడి అనిపంచదు అంటున్నారు . మనసు హాయిగా అనిపించే సంగీతం వింటూ ఉంటె గుండె పనితీరు బావుంటుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి కూడా . మ్యూజిక్ వింటూ డ్రైవ్ చేసేవాళ్ళని ,హార్ట్ రేట్ మానిటర్ అనే వేరబుల్ పరికరం ద్వారా గుండె వేగాన్ని పరీక్షిస్తే వాళ్ళ గుండె వేగం నార్మల్ గా ఉందట కనుక కారులో ప్రయాణించే సమయంలో సంగీతం లేదా పాటలు వినండి అంటున్నారు .

Leave a comment