Categories
శరీరానికి మసాజ్ తర్వాత తప్పనిసరిగా స్టీమ్ బాత్ ఉంటేనే చక్కని ఫలితాలు ఉంటాయని ఎప్పటినుంచో వైద్యులు సిఫారసు చేసేదే. కానీ ఈ ఆవిరి స్నానం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చని శాస్త్రవేత్తలు అభ్ప్రాయపడుతున్నారు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని యాభై శాతం తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు. వారంలో కనీసం ఐదారు సార్లు ఆవిరి స్నానం చేస్తే ఫలితాలు ఎంతో బావుంటాయని వీరి ఉద్దేశ్యం. కనీసం వారానికి రెండుసార్లు చేసిన శరీరపు అలసట తగ్గటంతో పాటు రక్తపోటు ఇరవైనాలుగు శాతం తగ్గుతుందని వారు గుర్తించారు.వారం పొడవునా ఏడుసర్లు చేస్తే రకపోటు 40 శాతం తగ్గిపోతుందని అద్యాయనాలు గుర్తించాయి.