ఎవ్వరికి మృత్యువు అంటే ఇష్టం ఉండదు. కానీ చావును పరిచయం చేసే ఈ కిడ్ మాయిడెత్ కేఫ్ ని మాత్రం అందరూ ఇష్టపడుతున్నారు.  థాయ్ లాండ్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో ఒక శవపేటిక ఉంటుంది. ఇందులో పడుకొని కాసేపు నిద్రపోతే డ్రింక్ ధరలో డిస్కౌంట్ అని ప్రకటించారు. శవసేటికలో పడుకోగానే దాన్నీ మూసేస్తాను. ఆ అంధకారంలో నిజమైన జీవితానికి అర్ధం తెలుసుకోవచ్చని మరణం ఎలా ఉంటుందో తెలిస్తే మనిషిలో ఈర్ష్యాద్వేషాలు, కోపం తగ్గిపోతుందని నిర్వహకులు భావిస్తున్నారు. ఈ ఐడియా నచ్చి కష్టమర్లు పోటెత్తుతున్నారట.

Leave a comment