శిల్పా శెట్టి గొప్ప ఫిట్ నెస్ ఫ్రీక్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మే కాకుండా తన వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. శరీరపు ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు వృక్షాసనం బెస్ట్ అంటుంది శిల్పా అలాగే ఓంకారం జపించటం ద్వారా శరీరంలో నాడులు చురుగ్గా పనిచేస్తాయి ఒంటరిగా చేసే వ్యాయామం కన్నా తోడుగా ఎవరైనా ఉంటే వ్యాయామం చేయటం సరైన ఆహారం తీసుకోవటం తేలిక అంటుంది శిల్పా. డీప్ స్క్యాట్స్ శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. వ్యాయామం ఎప్పుడూ సరిగ్గా ఉండేలా చూసుకోండి అంటుంది శిల్పా. నిజానికి వ్యాయామం చేసేందుకు జిమ్ అవసరం లేదు ఇంట్లో ఉన్న మెట్లు అయినా సరే వ్యాయామం చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి అందుకు ఇంట్లోనే హైడ్రా పోనిక్ వ్యాయామం మొదలు పెట్టింది అంటారామె. తక్కువ ఆహారం తీసుకునేలా కూడా ప్లాన్ చేసుకోవాలి శరీరం బరువు పెరగకుండా ఒకేరకంగా ఉండేందుకు మార్గం వ్యాయామం ఒక్కటే !

Leave a comment