నీరజ సినిమాలో నటనకు గానూ 2016లో జాతీయ అవార్డ్ సాధించిన సోనమ్ కపూర్ సామాజిక సేవంటే చాలా ఇష్టం అంటుంది. నాకు స్రయాణాలు చేయటం కూడా అంతే ఇష్టం . చిన్నప్పుడు ఇటలీ ట్రిప్ వేశాం. రోమ్ నగరం ఎంతో అందంగా ఉందో నాకు ఇప్పటికీ గుర్తే .ఫ్రాన్స్ లోని బోరాబోరా సముద్రతీరాలు ,యూరప్ లోని మీంట్ బ్లాంక్ పర్వతాలు స్పాలు నేనెంతో ఇష్టపడుతానో .రకరకాల స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేశాను ఎప్పుడు షాపింగ్ ఇష్టమే .ప్రయాణాల్లో కెమెరా ,వాకింగ్ షూస్ .ఓ శాలువా దగ్గరే ఉంచుకొంటా ,ఇంకా పుస్తకాల సంగతి చెప్పనే వద్దు . ప్రశాంతమైన పర్వతాలు ,సముద్ర తీరాల్లో చదువుకొంటా ఎంజాయ్ చేయవచ్చు అంటుంది సోనమ్ కపూర్. ఇలాంటి కబుర్లు చెపితే ఎవరైనా ప్రయాణాలకు సిద్ధం అయిపోతారు.

Leave a comment