Categories
యుక్త వయస్సులో మొటిమల సమస్య చాలా సహాజం కానీ ఆకుపచ్చ కూరగాయలు ,పండ్లు ,చేపలు ,గ్రీన్ టీ మొటిమలు రాకుండా అడ్డుకొంటాయి. ఎక్కువగా నీరు తాగటం కూడా అవసరం .ఇవి శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపిస్తాయి. ఆహారంలో తప్పని సరిగా ప్రో బయోటెక్ పదార్థాలు ఉండాలి. అలాగే మొటిమలు ఎక్కువ వస్తుంటే కొద్ది కాలం పాటు వేపుడు పదార్ధాల జోలికి పోకుండా ఉండటం మంచిదీ. అలాగే డెయిరీ ఉత్పత్తులు వెన్న,నెయ్యి అధికంగా తీపుకొన్న మొటిమలు ఎక్కువ రావచ్చు. మొటిమలు గిల్లటం ,ప్రెస్ చేయటం వద్దు ఒక్కసారి ఇన్ ఫెక్షన్ ఎక్కువై పుండ్లు పడే అవకాశం ఉంటుంది.