ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హాసనగర్ తాలూకా మల్లి గిరి లో పనిచేసే రేఖ కులాల్ తన స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి 1000 రూపాయలు ఇస్తారు. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండేలా ఆమె ఆ డబ్బు బాండ్ రూపంలో స్థానిక కెనరా బ్యాంక్ లో పొదుపు చేస్తారు పదేళ్ల తరువాత వడ్డీతో సహా ఆ డబ్బు పిల్లలు తీసుకోవచ్చు. ఈ చిన్న ప్రయత్నం తో స్కూలు విద్యార్థులు పెరిగారు. డబ్బుతో పాటు స్కూలుకు ఉపయోగపడే అవసరమైన పరికరాలు దాతల సాయంతో సమకూర్చుతారు రేఖ కులాల్ ఆమె కృషి తో ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Leave a comment