పెద్దపల్లి జిల్లా పుట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సజ్జనం భాగ్యలక్ష్మి ఆ గ్రామంలోని ఇల్లు భవనాలు గోడలపై రంగుల తో పాఠ్యాంశాలు రాసి పిల్లల తో చదివిస్తున్నారు. ప్రత్యక్ష బోధన లేక దాదాపు ఏడాదిన్నర నుంచి పిల్లలు చదువుకు చాలా దూరంలో ఉన్నారు టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రభుత్వ పాఠాలు బోధించిన అవి పిల్లలకు చేరటం లేదు దానితో భాగ్యలక్ష్మి గ్రామం లోని గోడల పై తెలుగు ఇంగ్లీష్ వర్ణమాల గణిత అంశాలు పదబంధాలు స్వయంగా రంగుల తో రాశారు. తన సొంత డబ్బుతో సహచర ఉపాధ్యాయుల సాయం తో గత ఐదు నెలలుగా పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారు.

Leave a comment