టి.వి చూపెడుతూ చిన్నప్పుడు పిల్లలకు అన్నం పెట్టడం అలవాటు చేస్తారు తల్లులు . ఏవో బోమ్మలు చూస్తూ ఏం తింటున్నారో తెలుసుకోకుండా నోరు తెరుస్తు ఉంటారు. ఆ వయసులో తల్లులు అమ్మయ్య అనుకొవచ్చు . కానీ పెద్దవుతున్న కొద్ది టి.వి , స్క్రీన్ లేదా చేతిలో ఏదో ఫోన్ లో చూస్తుటే తప్ప అన్నం తిననంటారు. అలవాటు చేశం కదా. ఇక ఐదారేళ్ళు వస్తాయి కనుక చదువుకొనే అవసరం ఉంది కనుక టి.వి ఇతర గాడ్జెట్లని అవతల పెట్టే వైపుగా ప్రయత్నం చేయాలి. వాళ్ళు అలుగుతారు, అల్లరి చేస్తారు, బాగా ఏడ్చి అమ్మపైన ఎమోషనల్ గా విజయం సాధించాలని చూస్తారు. అయినా సరే కాస్త కఠినంగా ప్రణాళికాతో కాస్త పెద్దవాళ్ళు మొండిగా ఉండి పిల్లల్ని దారి మళ్ళీంచాలి. వినటం ,వాసన చూడటం ,రుచి స్పర్శ చూడటం వంటి ఐదు సెన్స్ లూ పని చేస్తేనే పిల్లల్లో మానసిక వికాసం ,మాటలు వింటూ , స్పర్శ తో గుర్తిస్తూ చూస్తూ, చెపుతూ ,మనలాగే అన్నీ అనుభవాలతో పెద్దవాళ్ళవ్వాలి. దీన్ని గుర్తు పెట్టుకొంటే చాలు.
Categories