మనుషులకు సేవా చేస్తే భగవంతుడికి పూజా చేసినట్లే అంటారు .పిట్స్ బర్గ్ నిపుణులు ఒక అధ్యయనం నిర్వహించి అందరికీ సాయం చేసే హృదయం ఉన్నా తల్లిదండ్రులకు మంచి బిడ్డలు పుడుతారంటున్నారు. లేదా వాళ్ళు మంచి తల్లిదండ్రులు అవుతారు అంటారు.ఒక వంద మందిని ఎంపిక చేసి ఇతరులకు వాళ్ళు సాయం చేసే సమయంలో వాళ్ళ భావోద్వేగాలకు కారణం అయ్యే మెదడు భాగాలు ఎమ్మరై స్కాన్ చేశారు. అదే తల్లిదండ్రులు వారు ,పిల్లలు ఆనందంగా గడిపే సమయంలో మెదడులో కలిగే మార్పులు రికార్డు చేశారు. ఈ రెండు సార్లు మెదడు ఒకే రకంగా స్పందించిందట. ఎదుటి వారి కష్టాలకు స్పందించే తల్లిదతండ్రులు ,పిల్లలు ఎంతో ప్రేమగా పెంచేగులుతారని ఈ సర్వే రుజువు చేసింది. సాధారణంగా అలాంటి పెంపకంలో పెరిగిన పిల్లలు తప్పకుండా మంచి గుణాలన్ని పుణికిపుచ్చుకొంటారు.
Categories