చలి పెరుగుతున్న కొద్దీ చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొడి చర్మం గలవారికి మరీ సమస్య. ఈ కాలంలో తేమ తక్కువ .దీని వల్ల వంటిపైన స్వేదం త్వరగా ఆరిపోతుంది.ఎక్కువ నీళ్ళు తాగటం మంచి పద్దతి. మరీ వెచ్చనివీ, చల్లనివీ కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. పాదాలు, చేతులు పొడిబారకుండా గ్లిజరిన్ ఉండే క్రీమ్స్ ,పెట్రోలియం జెల్లి మాయిశ్చరైజర్లు వాడుకోవాలి.వారానికి ఒక సారి పాదాలను స్క్రబ్ తో రుద్ది ,పడుకొనే ముందర పెట్రోలియం జెల్లి రాసి సాక్స్ లేసుకొంటే పాదాలు మెత్తగా ఉంటాయి.

Leave a comment