మీటూ ఉద్యమం ఎంతో మందిని కలుపుకు వస్తోంది. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ భార్య,కథనాయిక ఆలియా భట్ తల్లి అయినా సోనీ ఎన్నో సినిమాల్లో నటించింది. ఒక మీడియా సంస్థలో ఆమె మట్లాడుతూ ఒక సినిమా చిత్రీకరణ సందర్భంలో ఒక వ్యక్తి నాపై అత్యాచారం చేయాలని చూశాడు. కానీ అతని ప్రయత్నం ఫలించ లేదు.నేను ఎక్కడా ఈవిషయం చెప్పలేదు. అతని కుటుంబంతో నాకు మంచి సంబంధాలున్నాయి. నేను నోరు తెరిస్తే కుటుంబం చిక్కుల్లో పడుతుందవని నేను మట్లాడలేదు. సీనియర్ నటుడు అలోక్ నాథ్ మధ్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించటం నాకు తెలుసు .ఓ సారి ఆయన నన్ను చూసిన తీరు నాకు నచ్చలేదు అంటూ చెప్పింది సోని.