క్షమాపణల కోసమో అవకాశాల కోసమో నేను మీటూ పోరాటం మొదలు పెట్టలేదు. ఆడవాళ్ళకు సరైన న్యాయం జరగాలి. నేను ఆరోపణ చేసింది చిన్న చితగా మనిషి కాదు, నానా పాటేకర్ పెద్దమనిషిగా చలమణి అవుతున్న వ్యక్తి. ఆయనకు వ్యతిరేఖంగా సినీ అండ్ టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ ముందుకు రాలేదు. పదేళ్ళుగా ప్రతి ఇంటర్వ్యూలు నాకు ఎదురైన లైంగిక ఆరోపణలు చెపుతూనే ఉన్నాను.ఇదిగో ఇప్పటికి స్పందన వచ్చింది అంటోంది తనుశ్రీ దత్తా. బాధ అనే ముల్లు గొంతుకు అడ్డంగా పడుతూంటే ముద్ద ఎలా దిగుతుంది. ముల్లు తీసేస్తేనే స్వాంతన దొరుకుతోంది. ప్రస్తుతం మీటూ ఉద్యమం ఆముల్లు తీసేందుకు ప్రయత్నిస్తోంది . నాకు ఎదురైన దుఃఖం ఆధ్యాత్మిక సంస్థల్లోనూ ప్రసంగాల్లో ,దేన్లోనూ స్వాంతన పొందలేకపోయింది. ఎక్కడ చూసిన స్త్రీలపైన వేధింపులే .అప్పుడు అమెరికా వెళ్ళాను .ఎంతకాలం అక్కడ ఉంటాను. నా దేశానికి నేను తిరిగి వచ్చా. నా పోరాటం మళ్ళీ మొదలైంది అంటోంది తనుశ్రీ దత్తా.
Categories